బుచ్చయ్యపేటలో నేడు విద్యుత్ అంతరాయం
AKP: బుచ్చయ్యపేట మండలంలో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. పెదమదీన, చినమదీన, గునెల్లపూడి, అయితంపూడి, కె.పి అగ్రహారం, కొండపాలెం, పైడంపేట, పి.భీమవరం, శ్రీరాంపురం, గొన్నవానిపాలెం గ్రామాల్లో కరెంట్ అంతరాయం ఉంటుంది. చెట్ల కొమ్మల తొలగింపు పనుల వల్ల ఈ చర్యలు చేపట్టినట్లు ఈఈ రామకృష్ణ పేర్కొన్నారు.