VIDEO: 'నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

VIDEO: 'నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

ASF: గణపతి నిమజ్జనం ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ తెలిపారు. గురువారం పెద్దవాగు నిమజ్జన స్థలాన్ని పరిశీలించారు. వాగులోకి ఎవరూ పడితే వారు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వినాయకులను నిమజ్జనం చేయడానికి పెద్ద క్రేన్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు.