'3 రోజులు సోయా కొనుగోలు బంద్'

'3 రోజులు సోయా కొనుగోలు బంద్'

ADB: భీంపూర్ మండల కేంద్రంలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు సోయా కొనుగోళ్లు నిలిపివేసినట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ కేశవ్ శనివారం తెలియజేశారు. సోయా నిల్వలు అధికంగా ఉన్నందున కొనుగోలు నిలిపివేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 3 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.