రాష్ట్ర వాలీబాల్ జట్టుకు ఎంపికైన అరకు విద్యార్ధి

రాష్ట్ర వాలీబాల్ జట్టుకు ఎంపికైన అరకు విద్యార్ధి

ASR: అండర్-15 జాతీయ స్ధాయి వాలీబాల్ పోటీల రాష్ట్ర జట్టుకు అరకు క్రీడా పాఠశాల విద్యార్ధి ఎం.చరణ్ నాయక్ ఎంపికైనట్లు సోమవారం ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు ఈ రోజు విజయవాడలో జరిగిన రాష్ట్ర జట్టు ఎంపికలో చరణ్ నాయక్‌కు చోటుదక్కిందని కోచ్ వై.శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 23న పుణెలో జరగనున్నాయి.