VIDEO: వీధి కుక్కల బెడద.. ప్రజల ఇబ్బందులు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో వీధి కుక్కలు కొద్దిరోజులుగా స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారులపై వీధి కుక్కలు పదుల సంఖ్యలో చేరి బాటసారిలతోపాటు ద్విచక్ర వాహనదారులపై దాడులు చేస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సంచారం వల్ల కలుగుతున్న ఇబ్బందులపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.