స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: ఎర్రబెల్లి

WGL: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం వర్ధన్నపేట పట్టణంలో మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. దయాకర్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ నాయకుడు, కార్యకర్త కష్టపడాలని సూచించారు.