VIDEO: సీసీఐ పత్తి కొనుగోలు గడువు పొడిగించాలి
SRD: సీసీఐ పత్తి కొనుగోలు గడువును పొడిగించాలని నారాయణఖేడ్ మండలం చాప్టా కే గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వాన్ని కోరారు. కంగ్టి మండలంలోని సీసీఐ కొనుగోలు కేంద్రం పత్తి మిల్లు వద్ద గురువారం మాట్లాడుతూ.. గత నెలలో పత్తి ధర తగ్గడంతో అమ్మలేదన్నారు. అయితే ఇప్పుడు సీసీఐ కొనుగోలు రెండు రోజులే గడువు ఉందని తెలపడంతో విచారం వ్యక్తం చేశారు.