'వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ఎంట్రీ చేయాలి'

KMR: వరి ధాన్యపు కొనుగోళ్లను ఎప్పటికప్పుడు ట్యాబులో ఎంట్రీ చేయాలని, జిల్లా సహకార మానిటరింగ్ అధికారి సురేష్ సొసైటీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం బిక్కనూర్ మండలంలోని పెద్దమల్లా రెడ్డి వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సొసైటీ సీఈవో మోహన్ గౌడ్ ఉన్నారు.