విడవలూరులో కార్తీక అమావాస్య పూజలు
NLR: విడవలూరు మండల కేంద్రంలోని వెలగాలమ్మ గుంట శ్రీ శ్రీ శాంభవి సమేత స్వయంభు లింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.