కాంగ్రెస్‌తో 4 దశాబ్దాల అనుబంధం నాది: జీవన్ రెడ్డి
TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'తనతో కలిసి పనిచేయాలని సంజయ్ నాకు ఆఫర్ ఇచ్చాడు. అసలు సంజయ్ ఎవరు? నాకు ఆఫర్ ఇవ్వడానికి. నేను ఏ పార్టీలో ఉన్నానో ఆయనకు తెలియదేమో. కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం నాది. ఇంత సుదీర్ఘ అనుబంధం తెంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు' అని అన్నారు.