VIDEO: విశాఖ RK బీచ్‌లో ఎగసిపడుతున్న అలలు
VSP: దిత్వా తుఫాను ప్రభావంతో విశాఖ RK బీచ్‌లో సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాను కారణంగా బీచ్‌లో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంది. వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయి, అక్కడక్కడా చిరు జల్లులు కూడా కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.