పుంగనూరులో భవన నిర్మాణ కార్మికుల నిరసన

పుంగనూరులో భవన నిర్మాణ కార్మికుల నిరసన

CTR: జీవో నంబర్ 1217ను రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పుంగనూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లైములను పరిష్కరించి, నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.