విశాఖ పోర్టు అభివృద్ధి పనులపై సమీక్ష

విశాఖ పోర్టు అభివృద్ధి పనులపై సమీక్ష

VSP: కేంద్ర పోర్టులు, నౌకాయాన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ శుక్రవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని సందర్శించి పోర్టు పనితీరు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్‌పర్సన్ డా.ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సమీక్షలో పీపీపీ బెర్త్‌లు, కార్గో హ్యాండ్లింగ్ పై చర్చించారు.