బోథ్ సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు: సీఐ
ADB: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్లను ప్రభావితం చేసే విధంగా డబ్బులు పంచితే కేసును నమోదు చేయడం జరుగుతుందని సీఐ గురుస్వామి మంగళవారం తెలియజేశారు. ఓటుహక్కుపై ప్రలోభ పెట్టేలా రూ.5 వందలు ఇచ్చిన గొర్ల గంగయ్య, లక్ష్మణ్‌తో పాటు సర్పంచి అభ్యర్థిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.