పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఎంపిక

పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఎంపిక

PPM: వీరఘట్టం మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. ఈ మేరకు మండలశాఖ అధ్యక్షునిగా బంగారు బాబును, కార్యవర్గ సభ్యులుగా రాము, కోటీశ్వరరావు, చక్రధర్, తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం పంచాయితీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి అంత సమిష్టిగా కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు.