నేడు కలెక్టరేట్ ఉద్యోగులకు సెలవు

ADB: నిన్న కురిసిన భారీ వర్షాలకు జిల్లా కలెక్టరేట్ భవనం పైకప్పు కూలిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు పై అంతస్తుకు వెళ్లేందుకు అనుమతులను నిరాకరరించి, కలెక్టరేట్ భవనానికి తాళం వేశారు. కార్యకలాపాల కోసం అధికారులు ప్రత్యామ్నాయ భవనాన్ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ ఉద్యోగులకు నేడు సెలవు ప్రకటించారు.