పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

PDPL: హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పెళ్లై రెండేళ్లు గడిచినా సంతానం లేకపోవడంతో మనస్తాపానికి గురైన సౌజన్య (27) ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లికి చెందిన అనిల్‌కుమార్‌తో ఆమెకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అనిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా, సౌజన్య ఇంట్లోనే ఉంటోంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.