VIDEO: 'పేద రైతులకు పట్టాలు ఇవ్వాలి'

VIDEO: 'పేద రైతులకు పట్టాలు ఇవ్వాలి'

KRNL: తమ గ్రామంలో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన బెల్ట్ షాపులను ఎత్తివేయాలని, పేద రైతులకు పట్టాలు, పాసు పుస్తకాలు ఇవ్వాలని ఎంపీటీసీ సభ్యురాలు నాగ శిరీష డిమాండ్ చేశారు. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెలో  బుధవారం మండల పరిషత్ సమావేశ భవనం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అటవీ భూములపై ఆన్‌లైన్ నమోదు సాధ్యం కాదని తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు.