VIDEO: మండల కేంద్రాలకు చేరిన అధికారులు
GDWL: గద్వాల జిల్లా గట్టు మండల MDPO ఆఫీస్ దగ్గర ఎలక్షన్ ఆఫీసర్లు చేరుకున్నారని స్థానికులు తెలిపారు. రేపు గట్టు మండలంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు తమకు కేటాయించిన గ్రామాలకు బయలుదేరుతున్నట్లు తెలిసింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండడంతో అధికారులు ముమ్మరంగా పనులు ప్రారంభించారు.