80 తులాల వెండి చోరీ
SRD: తాళం వేసిన ఇంట్లో 80 తులాల వెండి చోరీ జరిగిన ఘటన సిర్గాపూర్ మండలం విఠల్నాయక్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. తండాకు చెందిన విస్లావత్ బుడ్డీబాయి ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. సాయంత్రం వచ్చి చూడగా.. తలుపులు తెరిచి ఉన్నాయి. దొంగలు బీరువాలు బద్దలుగొట్టి 80 తులాల వెండి, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు.