జనాభ లెక్కల నమోదు పక్కాగా చేయాలి: కమిషనర్
E.G: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో జనగణన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'జనాభా లెక్కింపు-2027' దేశాభివృద్ధికి అత్యంత కీలకమని, యంత్రాంగం అంకితభావంతో పనిచేయాలన్నారు.