వారంతా BRSలోకి వెళ్లిపోండి: మైనంపల్లి

వారంతా BRSలోకి వెళ్లిపోండి: మైనంపల్లి

TG: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో BRS కోవర్టులు ఉన్నారని, వారివల్లే పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ఈ కోవర్టులు లేకపోతే అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచేదన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారు BRSలోకి వెళ్లిపోతే కాంగ్రెస్ మరింత బలపడుతుందన్నారు.