డుంబ్రిగుడలో ప్రపంచ మలేరియా దినోత్సవం

ASR: డుంబ్రిగుడ పీహెచ్‌సీలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారు. వైద్యాధికారి రాంబాబు మాట్లాడుతూ.. దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో మలేరియా ఒకటి అన్నారు. దేశంలో మలేరియా కేసులు ఆ జ్వరం కారణంగా మరణాలు అధికంగా నమోదు అవుతూనే ఉన్నాయన్నారు. అందుకే ఏటా ఏప్రిల్ 25న ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు.