'శబరిమల కేసులో లెఫ్ట్ కుట్ర'.. మోదీ ఆరోపణలు
కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ LDF ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శబరిమల ఆలయ వివాదంలో లెఫ్ట్ పార్టీల ప్రమేయం ఉందని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. గోల్డ్ స్మగ్లింగ్ (లూటీ) కేసులో LDF సభ్యుల హస్తం ఉందని, లూటీ చేసిన బంగారాన్ని వారు విక్రయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళ అభివృద్ధిని లెఫ్ట్ పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.