చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్

CTR: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. చౌడేపల్లి పోలీస్టేషన్లో కేసు వివరాలను వెల్లడించారు. శంకర, నారాయణ మూడు నెలలుగా అన్నమయ్య జిల్లాలో ఒంటరిగా ఉన్న మహిళల మెడలలో గొలుసులు చోరీ చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ. పది లక్షలు విలువ చేసే 152 గ్రాముల బంగారం, బైక్ రికవరీ చేశామన్నారు.