'ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ'
NTR: కంచికచర్ల మండలం పరిటాలలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. రైతుకు కష్టం, సాంకేతికత తోడైతే తిరుగు ఉండదన్నారు. ప్రభుత్వ రైతు యాప్ ప్రయోజనాలను వివరించి, పంటల మార్పిడి, శాస్త్రీయ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమవుతుందని తెలిపారు.