రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NLG: చౌటుప్పల్ మండలం దామెర గ్రామ సమీపంలో శుక్రవారం ఎదురెదురుగా వచ్చిన రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌లు నడుపుతున్న గట్టుప్పల్, లక్కారం గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.