కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NRML: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక క్షేత్రస్థాయి అమలును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే స్థానిక కేజీబీవీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.