'పిల్లల చదువులో తల్లిదండ్రులదే కీలక పాత్ర'
NGKL: విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. బిజినేపల్లి మండలం పాలెం జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల, కుటుంబం మధ్య సమన్వయం ఉండాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.