'ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి'

PLD: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని ఈపూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈపూరు మండలంలోని ఆరేపల్లి, ముప్పాళ్ల, రెడ్డిపాలెం, విప్పర్ల గ్రామాల్లోని వైన్ షాపుల్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఆయన చెప్పారు. మద్యం నిల్వలను రిజిస్టర్‌లో పరిశీలించిన సీఐ, మద్యం దుకాణాల్లో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.