పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బీసీ దంపతులు

KRNL: బనగానపల్లె ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటిశ్వరుడికి అమ్మవారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మలు మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం తిరుమల తిరుపతిదేవస్థానం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈఓ చంద్రుడు ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలతో భజంత్రీల మధ్య బీసీ దంపతులు సాంప్రదాయ బద్ధంగా స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.