దీక్షా దివస్.. KCR ఆమరణ దీక్షకు 16 ఏళ్లు

దీక్షా దివస్.. KCR ఆమరణ దీక్షకు 16 ఏళ్లు

TG: 'KCR సచ్చు డో.. తెలంగాణ వచ్చుడో' నినాదంతో 2009 నవంబర్‌ 29న KCR ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా.. నేటికీ 16 ఏళ్లు అవుతోంది. కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌ నుంచి సిద్ధిపేట రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలానికి బయలుదేరిన కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. జైలులోనే దీక్ష కొనసాగించగా.. యావత్‌ తెలంగాణ అట్టుడికింది.