కొండ భీమనపల్లిని సందర్శించిన ఎమ్మెల్యే

కొండ భీమనపల్లిని సందర్శించిన ఎమ్మెల్యే

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నెనావత్ బాలు నాయక్ మంగళవారం మార్నింగ్ వాక్‌లో భాగంగా కొండ భీమనపల్లి గ్రామం సందర్శించారు. గ్రామంలో వీధులు తిరుగుతూ ప్రజల నుండి సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఇలాంటి సమస్య ఉన్న ప్రజలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు, నాయకులు ఉన్నారు.