30 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

30 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

NTR: ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో మంగళవారం ఓ సంస్థ ఆధ్వర్యంలో 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షుడు రామినేని రాజశేఖర్ పాల్గొన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకుడు మొగులూరు ఎలీషా మాట్లాడుతూ.. సమాజ సేవ మనందరి బాధ్యత అన్నారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశామన్నారు.