ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక మాఫియా

ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక మాఫియా

BDK: బూర్గంపాడు పరిధిలో ఇసుక మాఫియా తీవ్రంగా పెరుగుతున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొన్ని గ్రామాల సమీప నదులలో అర్ధరాత్రి పూట జేసీబీలతో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. తవ్విన ఇసుకను టిప్పర్ల ద్వారా జిల్లా సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.