'పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలి'

MDK: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సునితారెడ్డి సూచించారు. ముఖ్యంగా పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని ఆమె కోరారు. సోమవారం తునికి సమీపంలోని బాపుజ్యోతిపూలే గురుకుల పాఠశాలను సందర్శించిన ఆమె, విద్యార్థులకు మాత్రలు వేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.