గుంటూరుకి చేరిన CRPF బలగాలు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం గుంటూరు రైల్వేస్టేషన్‌కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. గుంటూరు నగరంలో వారు బస చేయడానికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉన్న ఇంటర్ కాలేజీలను కేటాయించారు. 650మంది సిఆర్పిఎఫ్, 425 మంది ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు.