18 రోజుల పసికందును విడిచి.. బాలింత ఆత్మహత్య

BHPL: పురుగు మందు తాగి బాలింత ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల మండలంలోని ముచినిపర్తిలో చోటుచేసుకుంది. ప్రొబెషనరీ ఎస్సై హేమ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నిరోషా(26) వరంగల్ దేశాయపేటకు చెందిన ప్రశాంత్‌తో గతేడాది వివాహం జరిగింది. పాపకు 18 రోజులు కావడంతో పురుడు విషయంలో భర్త వేధింపులతో.. నిన్న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.