నిమజ్జనాల్లో మద్యం తాగితే చర్యలు: రాజాసింగ్

HYD: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గంలోని పలు గణేశ్ మండపాలను మంగళవవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేశ్ మహారాజ్‌ను అత్యంత పవిత్రంగా ప్రతిష్ఠిస్తున్నామని, 11వ రోజు నిమజ్జనానికి భక్తులు భారీగా తరలిస్తారని చెప్పారు. ఆ సందర్భంలో ఎవరైనా మద్యం తాగి ఊరేగింపులో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్‌ను అభ్యర్థించారు.