ఐఆర్‌సీటీసీలో 3కోట్ల నకిలీ ఖాతాలు: అశ్వినీ వైష్ణవ్
అర్హులైన ప్రయాణికులందరికీ టికెట్లు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు దళారుల టికెట్ల విక్రయానికి అడ్డుకట్ట వేసేందుకు 3 కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గతేడాది 75 వేల ప్రత్యేక రైళ్లను నడిపినట్లు చెప్పారు.