పోషణ పక్వాడ పక్షోత్సవాలు ప్రారంభించిన మంత్రి
ములుగు జిల్లాలో ఈ నెల 9నుంచి 23వరకు నిర్వహిస్తున్న 8వ పోషణ పక్వాడ పక్షోత్సవాల కార్యక్రమాలను జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క పాల్గొని ప్రారంభించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నూతన సెల్‌ఫోన్‌లు అందించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్‌ను సందర్శించారు.