సింగపూర్ చేరుకున్న మంత్రి నారాయణ
AP: అధికారిక పర్యటన నిమిత్తం మంత్రి నారాయణ సింగపూర్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు టీడీపీ ఫోరం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో జరిగిన సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రేపటి నుంచి సింగపూర్ ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల్లో నారాయణ పాల్గొననున్నారు.