VIDEO: 'నగర అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి'
GNTR: గుంటూరు నగర సమగ్ర అభివృద్ధికి మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నగరంలో అధ్వానంగా ఉన్న రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోతున్న వీధి కుక్కల బెడద వంటి సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.