పాఠశాలలోని రికార్డులు పరిశీలన: MEO
VKB: కులకచర్ల మండలంలోని బోట్యానాయక్ తండా పాఠశాలను MEO హబీబ్ అహ్మద్ తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. తరగతిలోని విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. ఉపాధ్యాయులు సమయానికి హాజరు కావాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.