'రేషన్ లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలి'

'రేషన్ లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలి'

PLD: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల చివరిలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని బుధవారం రెంటచింతల తహశీల్దార్ డి. మేరి కనకం హెచ్చరించారు. గడువులోగా చేయించుకోని పక్షంలో నిత్యావసరాల పంపిణీ నిలిచిపోతుందని ఆమె స్పష్టం చేశారు. డీలర్లు కూడా తమ బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని ఆదేశించారు.