ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం ఉంది. ధాన్యం చేరిన 48 గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి మొత్తాలు జమ అవుతాయి అని పేర్కొన్నారు.