'ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి'

'ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి'

VZM: వంగర KGBV గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ రోహిణి ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 6 నుంచి 10 తరగతి వరకు 40 సీట్లు, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కు 47 సీట్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆధార్‌ కార్డు, ఫొటోలు, ఇన్‌కమ్‌, క్యాస్ట్‌ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.