'బెట్టింగులకు పాల్పడే వారి వివరాలు ఇవ్వండి'

'బెట్టింగులకు పాల్పడే వారి వివరాలు ఇవ్వండి'

ప్రకాశం: కొండపి పోలీస్ సర్కిల్‌లో బెట్టింగులకు పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని CI సోమశేఖర్ శనివారం కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. బెట్టింగుల వలన యువత పెడదారి పడుతున్నారని, ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. బాకీలు తీర్చే సమయంలో డబ్బుకోసం మరింత పెడదారి పడుతున్నారన్నారు. జూదం, బెట్టింగులు, కోడి పందాలు నిర్వహిస్తే కఠిన శిక్షలుతప్పవని హెచ్చరించారు.