నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
VZM: నెల్లిమర్ల మండలంలోని సారిపల్లి గ్రామానికి గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని EE త్రినాధరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లిమర్ల ఐడీఏ సబ్ స్టేషన్ పరిధిలోని లైన్లలో నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.