బ్లూ బర్డ్స్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
MDCL: అల్వాల్ సర్కిల్ ఉమ్మడి మచ్చ బొల్లారం డివిజన్ పరిధి బ్లూ బర్డ్ కాలనీలో శుక్రవారం రూ. 18 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను కాలనీ వాసులు ప్రారంభించుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.